కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అభివృద్ధికి నిధులు కేటాయించండి  : కార్పొరేటర్లు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అభివృద్ధికి నిధులు కేటాయించండి  : కార్పొరేటర్లు

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని కార్పొరేటర్లు కోరారు. మంగళవారం ఆయనను సుడా ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో కలిసి అత్యవసరంగా చేయాల్సిన పనులపై ఆయనతో చర్చించారు. రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ సిటీలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, హైమాస్ట్‌‌‌‌‌‌‌‌ లైట్లు, పలు ప్రాంతాల సుందరీకరణ పనులకు రూ.20 కోట్లపైన వెచ్చించామన్నారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, కార్పొరేటర్లు ఉన్నారు.

 వేం నరేందర్ రెడ్డిని కలిసిన సుడా చైర్మన్‌‌‌‌‌‌‌‌ 

రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేంనరేందర్ రెడ్డిని సుడా చైర్మన్‌‌‌‌‌‌‌‌ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆయన నివాసంలో కలిసి ఎంపీగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏప్రిల్ 2న కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే తన కూతురు వివాహానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.